Abn logo
Jul 13 2020 @ 19:56PM

ఆగ‌స్ట్ 1 నుంచి థియేట‌ర్స్ ఓపెన్ కానున్నాయా?

కేంద్రం ప్ర‌భుత్వం థియేట‌ర్ల‌ను తెరిచేందుకు అనుమతులు ఇవ్వబోతుందా? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నం అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించి.. చాలా గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత షూటింగ్స్‌కు అనుమతి వచ్చినా.. అన్ని ఇండస్ట్రీలలో ఒకటి రెండు చిత్రాలు మినహా.. మరే చిత్రయూనిట్ షూటింగ్‌కు వెళ్లేందుకు సాహసించడం లేదు. కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ తరుణంలో షూటింగ్స్ చేయడం కరెక్ట్ కాదని.. ఆలోచిస్తూ అందరూ కామ్‌గా ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం థియేటర్లను కొన్ని నిబంధనలు పెడుతూ ఓపెన్ చేయాలనే ఆలోచనలు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


కూర్చునే విధానంలో మార్పులు, సీటుకు సీటుకు మధ్య గ్యాప్ ఉండేలా థియేటర్స్‌వారు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే థియేటర్స్‌లోకి అడుగు పెట్టేటప్పుడు గుంపులుగా కాకుండా ఒక్కొక్కరిని.. అందులోనూ ఫీవర్ టెస్ట్ చేస్తూ లోపలికి పంపించాలని, వెళ్లే ముందే చేతులను శుభ్రం చేసుకునేలా థియేటర్ బయట శానిటైజ్ విధానం ఉండాలని నియమాలు పెడుతూ.. ఆగస్ట్ 1 నుంచి థియేటర్స్ తెరిచేందుకు ట్రయల్స్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందట. అలాగే వయస్సు విషయంలో కూడా కొన్ని పరిమితులు పెట్టబోతున్నారని అంటున్నారు. ఇంకా ప్రేక్షకులు కూడా కంపల్సరీగా మాస్క్‌లు ధరించాలని చెబుతున్నారు. ఈ నియమ నిబంధనలను పాటించేలా ఉంటేనే థియేటర్స్ తెరిచేందుకు అనుమతి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతుందట. ఈ విషయంలో చాలా కఠినంగా ఉండేలా కూడా రూల్స్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. చూద్దాం ఆగస్ట్ 1న ఏం జరుగుతుందో..? 

Advertisement
Advertisement
Advertisement