Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది నిరంకుశ పాలన

కర్నూలు(అర్బన్‌) నవంబరు 29: కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలది నిరంకుశ పాలనని డీసీసీ అధ్యక్షడు అహమ్మద్‌ అలీఖాన్‌ అన్నారు. నగరంలో కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు జాన్‌ విల్సన్‌ ఆధ్వర్యంలో జన జాగరణ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్రగా బయలు దేరి పాతబస్టాండ్‌ అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్దకు చేరుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అహమ్మద్‌ అలీఖాన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో చెత్తపై పన్ను భారం ప్రజలపై మోపం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కేసులకు భయపడి సీఎం జగన్‌ బీజేపీ చేతిలో కీలుబోమ్మలా మారారని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించాలని, లేదంటే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, పెద్దారెడ్డి, పాలేం సుజాత, బ్రతుకన్న, తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement