Abn logo
Jul 12 2020 @ 03:56AM

రాష్ట్రానికి సహకారం అందిస్తున్న కేంద్రం

ఎమ్మెల్సీ రాంచందర్‌రావు  


వికారాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు అన్నారు. వికారాబాద్‌లోని నాగే్‌షగుప్తా గార్డెన్స్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రధాని అయ్యాక దేశం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించిందని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏమీ ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించడం సరికాదన్నారు. కరోనా కట్టడికి,  ఈ ప్రాంత అభివృద్ధికి, స్థానిక సంస్థలకు, జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం నిధులు అందిస్తోందన్నారు. కొత్త సచివాలయం ఆలోచన మానుకొని కరోనా నివారణ కోసం కృషి చేయాలన్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే కేంద్రం 800 పడకలను సిద్ధం చేసిందన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాద్‌రావు, నాయకులు శివరాజ్‌, మాదవరెడ్డి, కేపీ రాజు, విజయ్‌భాస్కర్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, ఎల్లయ్య పాల్గొన్నారు.

Advertisement
Advertisement