Abn logo
Oct 31 2020 @ 16:21PM

కాజల్‌కు ప్రముఖుల విషెస్!

Kaakateeya

చందమామ కాజల్ అగర్వాల్ మిసెస్‌గా మారిపోయింది. తను ప్రేమించిన గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. ముంబైలోని తాజ్ హోటల్లో ఈ పెళ్లి వేడుక జరిగింది. కాజల్ అగర్వాల్, గౌతం కిచ్లు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలను, ఫొటోలను కాజల్ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంది.


పెళ్లికి ముందు తీసిన ఫొటోను కాజల్ తన ‌ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. `తుఫానుకు ముందు ప్రశాంతత` అని కామెంట్ చేసింది. దీంతో పలువురు హీరోయిన్లు కాజల్‌కు ఇన్‌స్టా ద్వారా విషెస్ తెలియజేశారు. సమంత, అమలా పాల్, కీర్తీ సురేష్, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, మంచు లక్ష్మి తదితరులు కాజల్‌కు విషెస్ తెలియజేశారు. 


Advertisement
Advertisement