Advertisement
Advertisement
Abn logo
Advertisement

సిడియస్‌ బిపిన్ రావత్ మృతి.. అది ప్రమాదమా లేక కుట్రా?

భారత దేశపు మొట్టమొదటి సీడియస్(చీఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌) జెనెరల్ బిపిన్‌ రావత్‌ బుధవారం మృతి చెందారు. ఆయన ఆర్మీ హెలికాప్టర్‌లో తన భార్యతో సహా 13 మంది ఆర్మీ అధికారలతో ఒక హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు.. ఆ హెలికాప్టర్ క్రాష్ కావడంతో చనిపోయారని మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి. కానీ ఆయన మరణించిన ఒక్కరోజు ముందు బయోవార్ ముప్పు గురించి ముఖ్యంగా కరోనా లాంటి వైరస్ విపత్తు గురించి ఒక సదస్సులో మాట్లాడారు.


ఒకవైపు భారత్, చైనా సరిహద్దులో కాల్పులు జరగడం, మరోవైపు కరోనా లాంటి ప్రాణాంతక వైరస్‌ విషయంలో చైనాను ప్రపంచమంతా నిందించడం.. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ సైనికాధికారి అయిన బిపిన్ రావత్ పలుమార్లు చైనాను ఢీ కొట్టేందుకు సిద్ధమని అన్నారు. సరిహద్దులో ఇరు దేశాల మధ్య సైనికులు కాల్పులు జరుపుకోవడానికి డ్రాగనే కారణమని చెప్పారు.


ఈ అంశాలన్నీ పరిశీలిస్తే బిపిన్ రావత్ మరణం ప్రమాదం వల్లనేనా? లేక ఆయన మరణం వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే సందేహాలు కలుగకమానవు. అయితే ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి.. త్వరలోనే విచారణ జరుగుతుందని వాయుసేన ప్రకటించింది.


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement