Abn logo
Oct 12 2020 @ 03:58AM

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదం

Kaakateeya

కడ్తాల్‌ : నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు దోహదపడుతాయని ఎంపీటీసీల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు, ఎంపీటీసీ గూడురు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ఆయన పేర్కొన్నారు. కడ్తాల కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ. 50 వేల విరాళాన్ని ఆదివారం ఎస్‌ఐ సుందరయ్యకు చెక్కు రూపంలో అందచేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు, వ్యాపారులు ముందుకు రావాలని శ్రీనివాస్‌రెడ్డి కోరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డిని ఎస్‌ఐ అభినందించారు.  కార్యక్రమంలో మండల కోఆప్షన్‌ సభ్యులు జాహంగీర్‌ బాబ, మల్లయ్య, రాంచందర్‌ నాయక్‌, మంకి శ్రీను, మాలె మల్లేష్‌గౌడ్‌, సత్యం తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement