Abn logo
Sep 26 2021 @ 19:06PM

బీర్ల కంపెనీలకు షాక్.. రూ. 873 కోట్ల ఫైన్

ప్రపంచవ్యాప్తంగా బీరుకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటి సమాజంలో దీన్ని రేంజ్ మరో లెవల్‌లో ఉందనేది అతిశయోక్తికాదనే చెప్పాలి. అయితే ఇప్పుడు బీర్ ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ క్రమంలో కొన్ని కంపెనీలు కుమ్మక్కై బీర్ల ధరల విషయంలో అక్రమాలు జరిపాయంటూ వాటి మీద ఏకంగా కోట్ల రూపాయల ఫైన్ విధించాయి. ధరల విషయంలో అక్రమాలు జరిపారంటూ బీర్ల కంపెనీల మీద సీసీఐ సంస్థ కొరడా జులిపించింది. ఈ కంపెనీల మీద ఏకంగా 873 కోట్ల రూపాయల ఫైన్ విధించింది. ఈ ఫైన్ యునైటెడ్ బ్రొవరీస్ లిమిటెడ్ కార్ల్స్ బర్గ్ ఇండియాతో పాటుగా ఆల్ ఇండియా బ్రోవర్స్ అసోసియేషన్లకు ఈ ఫైన్లు అమలు చేస్తామంటూ తెలిపాయి. ఇక వీటితో పాటుగా  కేంద్రపాలిత రాష్ట్రాల్లోని కొన్ని బీర్ల కంపెనీలపై ఈ నిర్ణయం వర్తిస్తుందని సీసీఐ తెలిపింది. మొత్తం మూడు కంపెనీలకు ఈ ఫైన్ విధించినట్లు తెలిపింది. 


ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...