Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రవాస భారతీయులకు స్కూల్‌ అడ్మిషన్లపై సీబీఎస్‌ఈ శుభవార్త!

విదేశాల్లో ఉన్న భారతీయుల పిల్లల స్కూల్ అడ్మిషన్ గురించి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం ప్రవాస భారతీయుల పిల్లలు భారత స్కూళ్లలో అడ్మిషన్‌ పొందాలంటే విదేశాల్లో సీబీఎస్‌సీకి సరిసమానమైన సిలబస్‌ అందిస్తున్న ఎడ్యుకేషన్‌ బోర్డులకు అనుబంధంగా ఉన్న స్కూల్‌లో విద్యార్థులు చదువుతూ ఉండాలి. ఇందుకు సంబంధించిన పత్రాలను సీబీఎస్‌ఈకి సమర్పించాలి. వాటిని పరిశీలించి సీబీఎస్‌ఈ అప్రూవల్‌ ఇస్తుంది. 


కానీ తాజాగా ఈ నిబంధనని సడలిస్తూ ఆ అనుమతి అవసరం లేదని సీబీఎస్‌ఈ ప్రకటించింది. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చేపట్టే అడ్మిషన్లలో ఈ నిబంధన ఇప్పటి వరకు ఫాలో అవుతూ వస్తున్నారు. కోవిడ్‌ సంక్షోభం తలెత్తిన తర్వాత విదేశాలలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. లేదంటే జీతాల్లో కోత పడింది. దీంతో తమ పిల్లలను ఇండియాలో చదివించాలని భావించే పేరెంట్స్‌ సంఖ్య ఒ‍క్కసారిగా పెరిగింది. అయితే ఇప్పటివరకు ఉన్న సీబీఎస్‌ఈ నిబంధనలు వారికి అడ్డంకిగా మారాయి. బోర్డు తాజా నిర్ణయంతో ఎన్నారై తల్లిదండ్రుల కష్టాలు కొంత తగ్గినట్లే.

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement