Abn logo
May 23 2020 @ 04:10AM

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు

మహబూబ్‌నగర్‌, మే 22 : ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకే ఆటోలు, కార్లలో ప్రయాణికులను తరలించాలని, అంతకుమించి తరలిస్తే కేసులు నమో దు చేస్తామని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ దుర్గాప్రమీల హెచ్చరించారు. శుక్రవారం స్థానిక ఆర్టీఏ కార్యాలయంలో ఆటో, ప్రైవేట్‌ కార్లు, మ్యాక్సీ క్యాబ్‌ యజమానులు, డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆటోల్లో ఇద్దరు, కార్లలో ముగ్గురు ప్రయాణికులు, తుఫాన్‌ లాంటి వాహనాల్లో ఐదుగురు ప్రయాణికుల నే మాత్రమే చేరవేయాలని సూచించారు. అంతకుమించి తరలిస్తే వాహనాన్ని సీజ్‌ చేయడంతో పాటు జరిమానా విధిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంవీఐ శ్రీనివాస్‌రెడ్డి, నరేశ్‌, ఆర్టీఏ మెంబర్‌ జావెద్‌బేగ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement