బరేలీ (ఉత్తరప్రదేశ్): కొవిడ్ టీకాలకు వ్యతిరేకంగా పుకార్లతో కూడిన కరపత్రాలను పంపిణీ చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ నగరంలో జరిగింది. బరేలీ నగరంలోని నాగరిక రాజేంద్ర నగర్ ప్రాంతంలో కరోనా వ్యాక్సిన్లు తీసుకోవద్దంటూ కొందరు కరపత్రాలు పంపిణీ చేసినట్లు నగర ఎస్పీ రవీంద్రసింగ్ చెప్పారు. పోలీసులు కొవిడ్ టీకా వ్యతిరేక ప్రచార కరపత్రాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. కొవిడ్ టీకాల విషయంలో మతతత్వ అభిరుచులను రేకేత్తించేలా యత్నించారని పోలీసులు చెప్పారు. కొవిడ్ వ్యాక్సిన్ పై ప్రజలను తప్పుదోవ పట్టించేలా కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. కరపత్రాల పంపిణీ అనంతంర నిందితులను పట్టుకునేందుకు ప్రత్యే పోలీసులను మోహరించారు. బరేలీలో పోలీసులు అప్రమత్తమై టీకాలపై పుకార్లు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు.