Abn logo
Jan 21 2021 @ 12:44PM

భారత దేశంలో కొత్తగా 15,223 కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత దేశ వ్యాప్తంగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖంపట్టింది. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 15,223 మందికి కోరోనా నిర్ధారణ కాగా.. 151 మంది మరణించారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు కోటి 06 లక్షల 10వేల 883 పాజిటీవ్ కేసులు నమోదుకాగా.. 1 లక్షా 52 వేల 869 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,92,308 యాక్టివ్ కేసులు ఉన్నాయని గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. 

Advertisement
Advertisement
Advertisement