Abn logo
Sep 30 2020 @ 05:29AM

64వేలకు చేరువలో...

Kaakateeya

 మరో 1178 మందికి కరోనా


తిరుపతి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గడిచిన 32 గంటల్లో మరో 1178 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు అధికార యంత్రాంగం గుర్తించింది. సోమవారం ఉదయం 9 గంటల నుంచీ మంగళవారం సాయంత్రం 5 గంటల వరకూ నమోదైన ఈ కేసుల్లో తిరుపతి నగరంలో 278, చిత్తూరులో 145, మదనపల్లెలో 75, తిరుపతి రూరల్‌ మండలంలో 73, శ్రీకాళహస్తిలో 37, కుప్పం, పీలేరు మండలాల్లో 36 వంతున, పుంగనూరులో 30, పలమనేరులో 28, తవణంపల్లెలో 27, పుత్తూరులో 25, జీడీనెల్లూరు, కలికిరి మండలాల్లో 23 చొప్పున గుర్తించారు.అలాగే వడమాలపేట, పూతలపట్టు, వాల్మీకిపురం మండలాల్లో 18 వంతున, పాకాలలో 17, రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో 15 వంతున, చంద్రగిరి, చౌడేపల్లె మండలాల్లో 14 చొప్పున, బంగారుపాళ్యంలో 13, పెనుమూరులో 12, ఐరాలలో 11, శాంతిపురం, నగరి, సదుం మండలాల్లో 10 చొప్పున, పెద్దపంజాణిలో 9, కార్వేటినగరం, గుడిపాల మండలాల్లో 8 చొప్పున, గంగవరం, బైరెడ్డిపల్లె, తొట్టంబేడు, కేవీపల్లె మండలాల్లో 7 చొప్పున కరోనా కేసులను గుర్తించారు.


తాజా కేసులతో జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 63989కి చేరుకుంది.పీలేరులో ఒక పోలీసు అధికారితో పాటు నలుగురు పోలీసులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.ఆ అధికారి మంగళవారం పీలేరులో జరిగిన ఎంపీ మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. కార్యక్రమాలు పూర్తయిన అనంతరం మంగళవారం సాయంత్రం ఫలితాలు వెల్లడి కావడంతో ఆ అధికారితో సన్నిహితంగా మెలిగిన నాయకులు, కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు.కాగా కరోనాతో మరో ఆరుగురు చనిపోయారు.వీరితో కలిపి మృతుల సంఖ్య 647కు చేరింది

కొవిడ్‌ సెంటర్లలో 3051 పడకల ఖాళీ 

   తిరుపతిలో ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రులు, కేర్‌ సెంటర్లలో రాత్రి 9.30కు 3,051 పడకలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 2,808 సాధారణ, 243 ఆక్సిజన్‌ బెడ్స్‌ ఉన్నాయి. సాధారణ పడకలకు సంబంధించి రుయాలో 57, స్విమ్స్‌లో 148, ఈఎస్‌ఐలో25,  విష్ణునివాసంలో 523, మాధవంలో 360. పద్మావతి నిలయంలో 115, గోవిందరాజసత్రంలో 824, శ్రీనివాసంలో 736, టీటీడీ ఉద్యోగులకు 20, ఖాళీగా ఉన్నాయి.ఇక ఆక్సిజన్‌ బెడ్స్‌ రుయాలో130, ఈఎస్‌ఐ ఆస్పత్రిలో 32.. ఐసీయూలో  బెడ్స్‌ రుయాలో 40, ఈఎస్‌ఐ ఆస్పత్రిలో 41 అందుబాటులో ఉన్నాయి. 

Advertisement
Advertisement
Advertisement