Abn logo
Sep 13 2020 @ 03:32AM

విజృంభిస్తున్న కరోనా

Kaakateeya

ఉమ్మడి జిల్లాలో 1,094 కేసులు , ఇద్దరి మృతి


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా వ్యాప్తి రోజురోజుకు మరింతగా పెరుగుతోంది. పట్నం నుంచి పల్లెలకు విస్తరించి వైరస్‌ పంజాను విసురుతోంది. ఉమ్మడి జిల్లాలో రోజుకు వేయికి పైగా కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఒక్కరోజే 1,094 కేసులు నమోదయ్యాయి. ఇందులో రంగారెడ్డి జిల్లాలో 526, మేడ్చల్‌ జిల్లాలో 538, వికారాబాద్‌ జిల్లాలో 30 కేసులు ఉండగా ఇందులో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం మూడు జిల్లాల్లో కరోనా బాధితుల సంఖ్య 66,116కు చేరుకుంది. 


రంగారెడ్డి జిల్లాలో...

చేవెళ్ల/ఇబ్రహీంపట్నం/షాద్‌నగర్‌/ఆమనగల్లు/శంషాబాద్‌/కందుకూరు : చేవెళ్ల డివిజన్‌ పరిధిలో 284మందికి  పరీక్షలు చేయగా  38 మందికి పాజిటివ్‌గా తేలిందని వైద్యాధికారులు తెలిపారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 5, ఆలూర్‌ ప్రాథమిక ఆసుప్రతిలో 4, శంకర్‌పల్లి మండలంలో 4, మొయినాబాద్‌లో 8, షాబాద్‌లో 17మంది వైరస్‌ బారిప పడ్డారు. 


ఇబ్రహీంపట్నం డివిజన్‌లో 11 కేంద్రాల్లో 427 మందికి కరోనా టెస్టులు చేయగా 68 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో 3, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 13,  దండుమైలారంలో ఒకరికి, ఎలిమినేడులో 6,  మంచాలలో 4, ఆరుట్లలో 3, యాచారంలో 8, హయత్‌నగర్‌లో 5, తట్టిఅన్నారంలో 9, రాగన్నగూడలో 16 మందికి పాజిటివ్‌గా తేలింది.


షాద్‌నగర్‌ డివిజన్‌లో శనివారం 355 మందికి కరోనా యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించగా 57 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. 57 మందిలో షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన 18 మంది, ఫరూఖ్‌నగర్‌ మండలానికి చెందిన 21 మంది, నందిగామ మండలానికి చెందిన 8 మంది ఉండగా మిగతా 10 మంది ఇతర మండలాలకు చెందినవారున్నారు. 


ఆమనగల్లు, మైసిగండి పీహెచ్‌సీల పరిధిలోని 45 మందికి కరోనా పరీక్షలు చేయగా ఆమనగల్లుకు చెందిన ఆరుగురికి పాజిటీవ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.


శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలో 55 మందికి కరోనా పరీక్షలు చేయగా 17 మందికి పాజిటివ్‌ వచ్చిందని డాక్టర్‌ నజ్మాభాను తెలిపారు. 


కందుకూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో 63 మందికి పరీక్షలు చేయగా ఐదుగురుకి పాజిటివ్‌ వచ్చింది. లేమూరులో 2, నేదునూరులో 1, మంఖాల్‌లో 2 కేసులు వచ్చాయి. 


మేడ్చల్‌ జిల్లాలో...

మేడ్చల్‌ : మండల పరిధిలోని శ్రీరంగవరం పీహెచ్‌సీలో 44 మందికి కరోనా పరీక్షలు చేయగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యురాలు నళిని తెలిపారు.


వికారాబాద్‌ జిల్లాలో

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : వికారాబాద్‌ జిల్లాలో కరోనా ఉధృతి రోజు రోజుకు పెరుగుతోంది. శనివారం జిల్లాలో 30 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వికారాబాద్‌లో 5 కేసులు, తాండూరులో 4, నవాబుపేటలో 3, కులకచర్లలో 3, యాలాలలో 3, బషీరాబాద్‌లో 3, దోమలో 2, కొడంగల్‌లో 2, దౌల్తాబాద్‌లో 2, ధారూరు, మర్పల్లి, పరిగి మండలాల్లో ఒక్కో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుధాకర్‌ సింధే తెలిపారు.  ఇప్పటి వరకు కేసులు 1605కు చేరుకోగా,  545 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 24 మంది ఆసుపత్రుల్లో, 521 మంది హోంకేర్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఇంతవరకు 1024 మంది రికవరీ కాగా, మృతుల సంఖ్య 36కు పెరిగింది.


కులకచర్లలో 21 మందికి పరీక్షలు చేయగా ఆరుగురికి పాజిటివ్‌ నిర్దారణ అయ్యింది. ఘనాపూర్‌లో 2, ఖానాపూర్‌లో 2, ఇప్పాయపల్లి, కులకచర్లలో ఒక్కటి చొప్పున పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి మురళీకృష్ణ తెలిపారు.

Advertisement
Advertisement