Abn logo
Jul 7 2020 @ 03:24AM

కరీబియన్‌ లీగ్‌కు తాంబే ఎంపిక

న్యూఢిల్లీ: కరీబియన్‌ లీగ్‌ (సీపీఎల్‌)లో ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గా ముంబై మాజీ లెగ్‌ స్పిన్నర్‌ ప్రవీణ్‌ తాంబే నిలవనున్నాడు. ప్లేయర్ల డ్రాఫ్ట్‌లో 48 ఏళ్ల తాంబేను ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ దక్కించుకుంది. అయితే, అతడికి బీసీసీఐ నుంచి ఎన్‌వోసీ రావాల్సి ఉంది. 2020 లీగ్‌ కోసం ఆరు సీపీఎల్‌ ఫ్రాంచైజీలు జట్లను ఎంపిక చేసుకున్నాయి. ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 10 వరకు సీపీఎల్‌ను షెడ్యూల్‌ చేశారు.


Advertisement
Advertisement
Advertisement