Abn logo
Jan 18 2021 @ 06:18AM

అర్ధరాత్రి కారు బీభత్సం.. ఇంతవరకూ ఫిర్యాదు అందని వైనం

హైదరాబాద్/హయత్‌నగర్‌ : శనివారం అర్ధరాత్రి పెద్దఅంబర్‌పేట్‌ నుంచి కుంట్లూర్‌ వైపు అతివేగంగా వస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ ఇంటిని ఢీ కొట్టింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. హుండాయ్‌ ఐ 20 కారులో కొంతమంది యువకులు కలిసి కుంట్లూర్‌ వైపునకు వేగంగా వెళ్తున్నారు. రాత్రి 12 గంటల సమయంలో కుంట్లూర్‌ శివారు వద్దకు రాగానే కారు అదుపు తప్పి పక్కనే ఉన్న ఇంటి ప్రహరీని ఢీ కొట్టి ఆగిపోయింది. కారులో ఉన్న యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement