Abn logo
Sep 8 2020 @ 04:28AM

తగ్గని కరోనా ఉధృతి

Kaakateeya

ఉమ్మడి జిల్లాలో 737 కేసులు నమోదు, ఇద్దరి మృతి


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి రంగా రెడ్డి జిల్లాలో సోమవారం 737 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌ జిల్లాలో 515, వికారాబాద్‌ జిల్లాలో 34 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 188కేసులు నమోదు కాగా ఇందులో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 59,623కు చేరుకుంది. 


ఆమనగల్లులో..

ఆమనగల్లు : ఆమనగల్లు, మైసిగండి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలోని 44మందికి పరీక్షలు నిర్వహిం చగా 9మందికి పాజిటివ్‌ వచ్చింది. వారిలో ఆమనగల్లుకు చెందిన ఏడుగురు, మైసిగండి చెందిన ఇద్దరు ఉన్నారు.


షాద్‌నగర్‌ డివిజన్‌లో..

షాద్‌నగర్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో సోమవారం 405 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 58 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇందులో షాద్‌నగర్‌లో 11, కొత్తూర్‌ మండలంలో 14, ఫరూఖ్‌నగర్‌ మండలంలో 11, నంది గామ మండలంలో 11 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఇతర మండలాల్లో 11 కేసులు నిర్ధారణ అయ్యాయి.


చేవెళ్ల డివిజన్‌లో..

చేవెళ్ల : చేవెళ్ల డివిజన్‌ పరిధిలో 347 మందికి  కరోనా పరీక్షలు చేయగా 49మందికి పాజిటివ్‌ వచ్చింది. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 60మందికి కరోనా పరీక్షలు చే యగా 8, ఆలూర్‌ ప్రాథమిక ఆసుప్రతిలో72 మందికి పరీ క్షలు చేయగా 14, శంకర్‌పల్లి మండలంలో 101మందికి పరీక్షలు చేయగా 13, మొయి నాబాద్‌ మండలంలో 71 మందికి పరీక్షలు చేయగా 10, షాబాద్‌ మండలంలో 43 మందికి పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్‌ వచ్చింది.


ఇబ్రహీంపట్నం, కందుకూరు, శంషాబాద్‌ పరిధిలో..

ఇబ్రహీంపట్నం / కందుకూరు /శంషాబాద్‌ : ఇబ్ర హీంపట్నం డివిజన్‌లో శనివారం 11కేంద్రాల్లో 658 మం దికి కరోనా యాంటిజెన్‌ టెస్టులు నిర్వహించగా 137 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో 70మందికి పరీక్షలు చేయగా 15, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 45 మందికిగాను 6,  దండుమైలారంలో 30 మందికిగాను 7, ఎలిమినేడులో 58మందికిగాను 10, మంచాలలో 72 మం దికిగాను 10, ఆరుట్లలో 32 మందికిగాను 9, యాచా రంలో 78 మందికి 15, మాడ్గులలో 52 మందికిగాను 15, తట్టిఅన్నారంలో 77 మందికి పరీక్షలు చేయగా 21, రాగన్నగూడలో 56 మందికిగాను 17, హయత్‌నగర్‌ సీహెచ్‌సీలో 88 మందికిగాను 12 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కందుకూరు మండల కేంద్రంలో 11 మందికి పాజిటివ్‌గా తేలింది. కందుకూరులో 5, మీర్‌ఖాన్‌పేట 1, ఆకులమైలారంలో 1, ఉట్లపల్లిలో 2, కొలన్‌గూడలో 2 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలో 69మందికి కరోనా పరీక్షలు చేయగా 11మందికి పాజిటివ్‌ వచ్చింది.


వికారాబాద్‌ జిల్లాలో..

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : వికారాబాద్‌ జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. సోమవారం వికారాబాద్‌లో 14, పరిగిలో 5, ధారూరులో 4, బొంరాస్‌పేట్‌లో 4, తాండూరులో 2,  కొడంగల్‌లో 2, మోమిన్‌పేట, నవాబుపేట, దౌల్తాబాద్‌ మండలాల్లో ఒక్కో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా..

ధారూరు: ధారూరు పీహెచ్‌సీలో 20మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా అవుసుపల్లికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. ఇంతకుముందు ఇదే గ్రామంలో ముగ్గురికి కరోనా సోకింది. 


పరిగి,కులకచర్ల మండలాల్లో..

పరిగి / కులకచర్ల: పరిగి మండలంలో ఐదు కేసులు నమోదయ్యాయి. పరిగి పట్టణంలోని మైత్రీనగర్‌లో 2, గంజ్‌రోడ్‌లో 1, ఇబ్రహింపూర్‌లో 1, గోవిందాపూర్‌లో 1 కేసులు వచ్చాయి. అలాగే కులకచర్ల ఆసుపత్రిలో 12 మందికి పరీక్షలు నిర్వహించారు. అందులో  ఘనాపూర్‌కు చెందిన 4, రాంరెడ్డిపల్లిలో 1 కేసు నమోదైంది. 


కరోనా పరీక్షలు..

మేడ్చల్‌ : మేడ్చల్‌ ప్రభుత్వాసుపత్రిలో సోమవారం 9 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. అదేవిధంగా శ్రీరంగవరం పీహెచ్‌సీలో 34మందికి పరీక్షలు చేయగా ఐదుగురికి పాజిటీవ్‌గా తేలింది.

Advertisement
Advertisement