Abn logo
May 21 2020 @ 22:19PM

పిల్లితో పెళ్లి.. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటున్న అమెరికన్!

కాలిఫోర్నియా: అమెరికాకు చెందిన స్కాట్ పెర్రీ అనే వ్యక్తి పిల్లిని పెళ్లి చేసుకోనున్నాడు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. అయితే యానిమల్ షెల్టర్‌కు నిధులు సేకరించడం కోసమే తాను ఈ పెళ్లి చేసుకుంటున్నట్టు స్కాట్ పెర్రీ తెలిపాడు. స్కాట్ పెర్రీ తన పెంపుడు పిల్లి ఆలివియా లె చాట్‌ను ఈ నెల 23న పెళ్లి చేసుకోనున్నాడు. పెళ్లికి సంబంధించి, నిధులను సేకరించేందుకు ఓ వెబ్‌సైట్‌ కూడా రూపొందించాడు. వెబ్‌సైట్‌లో పెర్రీ ఏం రాసుకొచ్చాడంటే.. ‘బెస్ట్ ఫ్రెండ్స్ యానిమల్ సొసైటీలో ఆలివియాను చూసిన వెంటనే ప్రేమలో పడ్డాను. షెల్టర్‌కు వెళ్లిన సమయంలో ఆలివియా నా గర్ల్‌ఫ్రెండ్ ఒడిలోకి ఆ తరువాత మా గుండెల్లో చేరింది’ అని రాసుకొచ్చాడు. గర్ల్‌ఫ్రెండ్ కొద్ది కాలం క్రితం తనను వదిలేసి వెళ్లిపోవడంతో స్కాట్ పెర్రీ ఆలివియాతో జీవిస్తూ వస్తున్నాడు. కాగా.. ఈ నెల 23న వర్చువల్‌గా ప్రతిఒక్కరు పెళ్లిని చూడొచ్చని స్కాట్ పెర్రీ వివరించాడు. జంతు ప్రేమికులందరూ ఈ  పెళ్లికి చూడటానికి ఆహ్వానితులేనని అన్నాడు. ఈ పెళ్లి ద్వారా యానిమల్ షెల్టర్‌కు నిధులు సేకరించగలుగుతున్నానని ఆనందం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే.. స్కాట్ పెర్రీ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. 

Advertisement
Advertisement
Advertisement