Abn logo
Oct 24 2020 @ 17:14PM

115 బూటకపు కంపెనీలతో మోసానికి తెగించిన సీఏ స్టూడెంట్!

అహ్మదాబాద్ : ఉన్నత విద్యావంతుడైన ఓ విద్యార్థి ప్రభుత్వాన్ని మోసం చేయడానికి తెగించాడు. బూటకపు కంపెనీలు సృష్టించి, వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మోసాలకు పాల్పడ్డాడు. జీఎస్‌టీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) చదువుతున్న 25 ఏళ్ళ విద్యార్థి జీఎస్‌టీ మోసాలకు పాల్పడ్డాడు. ఆయన రూ.50.24 కోట్లు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందడానికి 115 బూటకపు కంపెనీలను సృష్టించాడు. ఆయన అహ్మదాబాద్ నివాసి. ఆయనను జీఎస్‌టీ అధికారులు అరెస్టు చేశారు. బూటకపు కంపెనీలను ఏర్పాటు చేయడానికి గ్రామీణుల ఐడీ కార్డులను ఈ విద్యార్థి ఉపయోగించాడని జీఎస్‌టీ అధికారులు తెలిపారు. యథార్థంగా వస్తువుల సరఫరా ఏదీ లేకుండానే ఇల్లీగల్ క్రెడిట్ బూటకపు సంస్థలకు చేరిందని తెలిపారు.