Abn logo
Jul 10 2020 @ 05:00AM

పేదల పట్టాల పేరుతో విధ్వంసం

పేదలకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినకోర్టు 

ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు 

 మాజీ ఎమ్మెల్యే బీవీ 


ఎమ్మిగనూరు, జూలై 9: వైసీపీ ప్రభుత్వం పేదల పట్టాల పేరుతో విధ్వంసాన్ని సృష్టిస్తోందని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆరోపించారు. గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలోని 64,65 సర్వే నంబర్లలో పట్టాలు పాత లబ్ధిదారులకే ఇవ్వాలని తాను డిమాండ్‌ చేశానని గుర్తుచేశారు. హైకోర్టులో రిట్‌పిటిషన్‌ ధాఖలు చేశానని, ఆ స్థలంలో ఎవరూ పనులు చేయొద్దని, థర్డ్‌పార్టీకి పట్టాలు ఇవ్వారాదని ఆర్డర్‌ (నెం. 10861ఆఫ్‌2020) యధాతథస్థితిని కొనసాగించాలని ఆదేశించిందని అన్నారు. కౌంటర్‌ దాఖలుకు రాష్ట్ర ప్రభుత్వానికి గడువు ఇచ్చిందన్నారు. హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కారని, ఈ సారికూడా అలాగే వ్యవహరిస్తారో చూస్తామని అన్నారు. తమ న్యాయ పోరాటం ఆగదని, పేదలకు నష్టం కలిగించిన వారినుంచి పరిహారాన్ని కక్కించేవరకు పోరాటం చేస్తామని అన్నారు. పట్టాల పంపిణీని టీడీపీ అడ్డుకుంటుందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారని ఇందులో వాస్తవం లేదన్నారు.


ప్రాజెక్టుల ఊసెత్తని ప్రభుత్వం

పశ్చిమ ప్రాంతం జీవనాడి ఆర్డీఎస్‌, గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులను  ప్రభుత్వం పట్టించుకోవటం లేదని బీవీ విమర్శించారు. వైఎస్‌ఆర్‌ పేరుతో రైతుదినోత్సవాలు జరుపుకుంటూ, రైతులకు అవసరమైన సాగునీటి ప్రాజెక్టుల ఊసెత్తకపోవటం దారుణమని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో టెండర్లు పూర్తయిన ప్రాజెక్టుల పనులు ఎప్పుడు ప్రారంబిస్తారని ప్రశ్నించారు. టీబీ డ్యాంలో నీరున్నా ఎల్లెల్సీ కాలువలో నీరు లేవన్నారు. ఎన్నికలకు ముందు రైతులకు పెట్టుబడి సాయం రూ.13,500 ఇస్తామని చెప్పి నేడు రూ.7,500 మాత్రమే ఇచ్చారని విమర్శించారు. వేలాదిమందికి ఉపాధి కల్పించే టెక్స్‌టైల్‌ పార్కుకు 99 ఎకరాలు కేటాయిస్తే దాన్ని ఇళ్ల స్థలాలకు కేటాయించారని, దీనిపై కూడా న్యాయపోరాటం చేస్తున్నామని అన్నారు. బడేసాహెబ్‌, కెఎండీ ఫారుక్‌, రంగస్వామి గౌడ్‌ రఫిక్‌, న్యాయవాది రషీద్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement