నితిన్’, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్‌దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రమిది. దేవిశ్రీప్రసాద్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రంలోని ‘సింపుల్ గుండే లైఫు.. టెంపుల్ రన్‌లా మారే.. బస్టాండే బస్టాండే’ అంటూ సాగే పాటను ఇటీవల విడుదల చేశారు. నృత్య దర్శకుడు శేఖర్ ఈ గీతానికి భిన్నమైన నృత్య రీతుల్ని సమకూర్చారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.