Abn logo
Sep 26 2021 @ 23:42PM

షార్ట్‌ సర్క్యూట్‌తో కిరాణా షాపు దగ్ధం

షార్ట్‌ సర్క్యూట్‌తో కిరాణా షాపు దగ్ధం

రామాపురం, సెప్టెంబరు 26: మండల కేంద్రంలోని మూడు రోడ్ల కూడలిలో ఉన్న బంకురామిరెడ్డి కిరాణాషాపు ఆదివారం తెల్లవారుజామున విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల జరిగిన ప్రమాదంలో 3 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితురాలు వాపోయారు. మూ డు రోడ్ల కూడలిలోని రామి రెడ్డి రూముల్లో ఇటీవల బసిరెడ్డిగారిపల్లెకు చెందిన ఆంజనమ్మ డ్వాక్రాలో వచ్చిన డ బ్బులతో కిరాణాషాపు పెట్టుకొని ఉంటోంది. రోజు మాదిరిగానే శనివారం రాత్రి షాపు మూసుకొని ఇంటికి వెళ్లింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దం వినబడగానే పక్కనే ఉన్న రామిరెడ్డి, చుట్టుప్రక్కల వారు చూడగానే షాపులో నుంచి మంటలు, పొగలు రావడం గమనించారు. వెంటనే పోలీసులు, షాపు యజమానురాలికి సమాచారం అందించారు.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. సబ్‌స్టేషన్‌కు ఫోన్‌ చేసి కరెంటును నిలుపుదల చేశారు. స్థానికులు నీళ్లు చల్లి మంటలను అందుపు చేశారు. మూడు లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితురాలు తెలిపింది.