Abn logo
Mar 5 2021 @ 12:08PM

బన్నీ బర్త్ డే గిఫ్ట్‌లు అవేనా?

గతేడాది `అల వైకుంఠపురములో..` సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప` సినిమా చేస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా కనిపించనున్నాడు. ఆగస్ట్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బన్నీ జన్మదినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 8న ఈ సినిమా టీజర్ బయటకు రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. 

అలాగే బన్నీ జన్మదినోత్సవం రోజున మరో సర్‌ప్రైజ్ కూడా ఉంటుందట. `పుష్ప` తర్వాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో కలిసి బన్నీ పనిచేయబోతున్న సంగతి తెలిసిందే. `పుష్ప` విడుదల తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది. ఏప్రిల్ 8న ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా ఉంటుందని తెలుస్తోంది. టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్ విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే బన్నీ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా అన్నమాట. 


Advertisement
Advertisement
Advertisement