Advertisement
Advertisement
Abn logo
Advertisement

సంక్షేమ బోర్డుకు నిధులు జమ చేయాలి

  భవన నిర్మాణ కార్మికుల నిరసన

 హనుమాన్‌జంక్షన్‌, డిసెంబరు 2: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి తరలించిన నిధులను జమ చేసి బోర్డును కాపాడాలని భవన నిర్మాణ కార్మికులు గురువారం హనుమాన్‌జంక్షన్‌లో నిరసన ప్రదర్శన చేశారు. కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా  ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా భవన నిర్మాణ కార్మికులు నాలుగురోడ్ల కూడలిలో ప్రదర్శన చేశారు. 1996 భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం, ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును కాపాడాలని నినదించారు. ఇనుము, ఇసుక, సిమెంట్‌ను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలని, కరోనా కారణంగా మృతి చెందిన కార్మికులకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు రాజనాల సురేష్‌, బాపులపాడు మండల నాయకులు చింతా సూరిబాబు, రాము, వడ్డి గిరి, రాము, చంద్రం పాల్గొన్నారు. 


Advertisement
Advertisement