Advertisement
Advertisement
Abn logo
Advertisement

జగన్‌కి వంద నాలుకలు: బుద్దా వెంకన్న

అమరావతి: రావణుడికి పది తలలు.. జగన్‌కి వంద నాలుకలని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. అసెంబ్లీలో నచ్చినప్పుడు బిల్లు పెట్టడం, ఉపసంహరించుకోవడం అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రాజధానులు, మండలి విషయంలో జగన్‌కు ఎదురుదెబ్బని, మండలి రద్దు సరికాదని ఎప్పుడో చెప్పామన్నారు. ఢిల్లీ వెళ్లి మరీ మండలిని రద్దు చేయాలని హడావుడి చేశాడన్నారు. అధికార బలం ఉందనే అహంకారంతో పాలన చేస్తున్నారని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement