Abn logo
Jan 20 2021 @ 23:41PM

పాతూరి వెంకట్‌రావుకు బుద్ధబోధి ధర్మ అవార్డు

షాద్‌నగర్‌ అర్బన్‌: షాద్‌నగర్‌కు చెందిన పౌలీ్ట్ర పారిశ్రామికవేత్త, పాతూరి ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు పాతూరి వెంకట్‌రావు చేస్తున్న సామాజిక సేవలకుగాను న్యూ మాంక్స్‌ కుంగ్‌ ఫూ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ శాఖ బుద్ధబోధి ధర్మ అవార్డు ప్రదానం చేసింది. హైదరాబాద్‌లోని తాజ్‌ డెక్కన్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో క్రీడలు, టూరిజంశాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌, అసోసియేషన్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, సినీ నటుడు నరేష్‌.. వెంకట్‌రావుకు అవార్డును ప్రదానం చేశారు. వెంకట్‌రావు సామాజిక సేవలను గుర్తించి అవార్డును ఇస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. న్యూ మాంక్స్‌ కుంగ్‌ఫూ అసోసియేషన్‌ మాస్టర్‌ ఎమ్మెన్‌.రవికుమార్‌, కృష్ణకుమార్‌రాజ్‌, కనకంయాదవ్‌, బాల్‌రాజ్‌, కార్మిక సంఘం రాష్ట్ర కన్వీనర్‌ పినపాక ప్రభాకర్‌, మలినేని సాంబశివరావులు వెంకట్‌రావును అభినందించారు. 


Advertisement
Advertisement