Advertisement
Advertisement
Abn logo
Advertisement

18 ఏళ్ల కూతుర్ని ఇంట్లో ఉంచి పెళ్లికి వెళ్లిన తల్లిదండ్రులు.. తిరిగొచ్చేసరికి ఆ 22 ఏళ్ల కొడుకు దారుణమిది..!

18 ఏళ్ల కూతుర్ని ఇంట్లో ఉంచి పెళ్లికి వెళ్లిన తల్లిదండ్రులు తిరిగొచ్చి అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి షాకైపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న కూతురిని చూసి నివ్వెరపోయారు. తమ కూతురిని కొడుకే గొంతు కోసి హత్య చేశాడని తెలుసుకుని తల్లడిల్లారు. బీహార్‌లోని దర్బంగాలో ఈ ఘటన జరిగింది. 


విశ్నాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఢిలాయ్ గ్రామానికి చెందిన రామంత్ షా తన భార్యతో కలిసి గురువారం ఓ పెళ్లికి హాజరయ్యాడు. తన 22 ఏళ్ల కొడుకు గోవింద్‌ను, 18 ఏళ్ల కూతురిని ఇంట్లోనే వదిలేశారు. అయితే వారు వెళ్లిపోయిన తర్వాత బయటకు వెళ్లి తాగొచ్చిన గోవింద్.. సోదరితో గొడవ పడ్డాడు. ఆ గొడవ పెద్దది కావడంతో తాగిన మత్తులో ఉన్న గోవింద్ ఇంట్లో ఉన్న రంపపు బ్లేడుతో సోదరి గొంతు కోసేశాడు. దీంతో ఆ యువతి అక్కడిక్కడే చనిపోయింది. గోవింద్ ఇంటి నుంచి పరారయ్యాడు. 


పెళ్లి నుంచి తిరిగి వచ్చిన రామంత్ దంపతులు రక్తపు మడుగులో పడి ఉన్న తమ కూతురి శరరీం చూసి షాకయ్యారు. డ్రగ్స్‌కు బానిస అయిన కొడుకే ఇంత పని చేసి ఉంటాడని తెలుసుకున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అక్కడకు వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. నిందితుడు గోవింద్ కోసం గాలిస్తున్నారు.  

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement