Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంటి బయట ఆడుకుంటున్న అక్కాతమ్ముళ్లు.. ఇంతలో జరిగింది ఘోరం.. క్షణంలో విగత జీవులుగా మారిన చిన్నారులు..!

ఆ పిల్లలిద్దరూ అక్కాతమ్ముళ్లు.. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షం కాస్త తెరిపినివ్వడంతో ఇంటి బయటకు వచ్చి ఆడుకుంటున్నారు.. ఈ సమయంలో హఠాత్తుగా పెద్ద శబ్దం చేస్తూ ఇంటి గోడ కూలిపోయింది.. ఆ గోడ కింద ఇరుక్కుపోయిన పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.. దీంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం అలముకుంది.. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావోలో ఈ ఘటన జరిగింది. 


ఉన్నావోలోని ఓ బస్తీలో జకీర్ అహ్మద్ అనే వ్యక్తి తన భార్య, నాలుగేళ్ల కూతురు సైఫా, రెండేళ్ల కొడుకు గోలుతో కలిసి నివసిస్తున్నాడు. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో అతని ఇంటి గోడలు పూర్తిగా నానిపోయాయి. బుధవారం ఉదయం వర్షం కాస్త తగ్గడంతో ఆడుకునేందుకు సైఫా, గోలు బయటకు వచ్చారు. ఇంటి ఆవరణలో ఇద్దరూ ఆడుకుంటున్నారు. 


ఉన్నట్టుండి హఠాత్తుగా ఆ ఇంటి గోడ కూలిపోయింది. ఆ గోడ కింద సైఫా, గోలు ఇరుక్కుపోయారు. చుట్టుపక్కల వారు చూసి వారిని బయటకు తీశారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారిద్దరూ ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement