Abn logo
Apr 20 2021 @ 19:50PM

భవిష్యత్తులో సంక్షోభాలు: నిపుణుల కమిటీ ఏర్పాటు చేయనున్న బ్రిటన్!

లండన్: భవిష్యత్తులో రాబోయే కరోనా తరహా సంక్షోభాలకు సిద్ధమయ్యే దిశగా బ్రిటన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వీటి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు అంతర్జాతీయ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా కొత్త వ్యాక్సిన్ల అభివృద్ధిని వేగవంతం చేస్తామని ప్రకటించింది. జీ7 దేశాల ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటు కానుంది. ‘కొత్త రోగాల నుంచి ప్రజలను రక్షించేందుకు చేసే ప్రయత్నాలను ఈ కమిటీ ముందుండి నడిపిస్తుంది’ అని బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి వ్యాఖ్యానించారు. ఈ కమిటీకి బ్రిటన్ సాంకేతికత సలహాదారు చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. టీకా తయారీ దారులు, శాస్త్రజ్ఞులు ఈ కమిటీలో భాగస్వాములుగా ఉండనున్నారు. 

Advertisement
Advertisement
Advertisement