Abn logo
Aug 3 2021 @ 23:05PM

తల్లిపాలలోనే బిడ్డకు పోషకాలు

తల్లిపాలపై అవగాహన కల్పిస్తున్న సీడీపీవో మమ్మీ

కొవ్వూరు, ఆగస్టు 3: పుట్టిన బిడ్డకు మొదటి ఆరు నెలలు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలని ఐసీడీఎస్‌ సీడీపీవో డి.మమ్మీ అన్నారు. నవజాత శిశువులకు అవసరమైన పోషకాలు తల్లిపాలలో మాత్రమే లభిస్తాయన్నారు. అర్బ న్‌ పరిధిలోని నాళం రామాలయం, రాజీవ్‌కాలని అంగన్‌వాడీ కేంద్రాలలో మంగళవారం తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. మమ్మీ మాట్లాడు తూ ఏడాది నుంచి రెండేళ్ల వరకు బిడ్డకు తల్లిపాలు తప్పనిసరిగా పట్టించాలన్నారు. వ్యాధి, సంక్రమణ నుంచి పిల్లలను రక్షించే జీర్ణమయ్యే ప్రొటీన్లు, సహజ రోగ నిరోధక శక్తితో తల్లిపాలు చాలా పోషకమైనవన్నారు. మున్సిపల్‌  వైస్‌ చైర్మన్‌ గండ్రోతు అంజనీదేవి, సూపర్‌వైజర్‌ టి.కనకవల్లి తల్లిపాల విశిష్టత వివరించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, గర్భిణులు పాల్గొన్నారు.