Abn logo
Jun 4 2020 @ 08:32AM

బ్రెజిల్‌లో క‌రోనా బీభ‌త్సం... 24 గంట‌ల్లో 1,349 మంది మృతి!

బ్రెజీలియా: బ్రెజిల్‌లో కరోనా వైరస్ అనియంత్రితంగా మారిపోతోంది. గత 24 గంటల్లో బ్రెజిల్‌లో క‌రోనా కార‌ణంగా 1349 మరణాలు సంభవించగా, మొత్తం మరణాల సంఖ్య 32 వేలు దాటింది. ఇప్పటివరకు బ్రెజిల్‌లో ఐదున్నర మిలియన్లకు పైగా ప్రజలు కరోనా వైరస్ బారిన‌ప‌డ‌గా, ప్రతిరోజూ ఇరవై వేలకు పైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. మీడియాకు అందిన స‌మాచారం ప్ర‌కారం బ్రెజిల్‌లో క‌రోనా వ్యాప్తికి సంబంధించిన గణాంకాలు పూర్తిగా వెల్లడికాలేదు. మరోవైపు అమెరికాలో కరోనా వైరస్ అంత‌కంత‌కూ విస్త‌రిస్తోంది. ఇప్పటివరకు యుఎస్‌లో సుమారు 18.5 మిలియన్ల మంది ప్రజలు కరోనా వైరస్ బారిన‌ప‌డ‌గా, లక్షకు పైగా ప్ర‌జ‌లు మృతి చెందారు. ప్రస్తుతం అమెరికా, రష్యా, బ్రెజిల్, భార‌త్‌ల‌లో క‌రోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement