May 11 2021 @ 10:16AM

మాస్ డైరెక్ట‌ర్‌తో అల్లు అర్జున్‌.. వ‌ర్క‌వుట్ అయ్యేనా?

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పుష్ప సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. ఈ సినిమా త‌ర్వాత బ‌న్నీ సినిమా కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుంది. అయితే ఈ గ్యాప్‌లో బ‌న్నీతో ఓ సినిమా చేయాల‌ని మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌. అందుకు త‌గిన‌ట్లు అల్లు అర్జున్ అండ్ టీమ్‌తో సంప్ర‌దింపులు జ‌రిపే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. ఇది వ‌ర‌కు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో స‌రైనోడు సినిమా రూపొంది బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమా బ‌న్నీని మాస్ ఆడియెన్స్‌కు దగ్గ‌ర చేసింది. అప్ప‌టి నుంచి బోయ‌పాటి అంటే బ‌న్నీకి ప్ర‌త్యేక‌మైన అభిమానం ఏర్ప‌డింది. దీంతో బోయ‌పాటి మ‌రోసారి బ‌న్నీని లైన్‌లో పెట్ట‌డానికి ట్రై చేస్తున్నట్లు టాక్‌. మ‌రి ఈ చ‌ర్చ‌లు ఏ మేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి మ‌రి.