Abn logo
May 23 2020 @ 05:21AM

ఒక్కోచోట..ఒక్కోరకంగా

అమల్లోకి లాక్‌డౌన్‌ సడలింపులు

రెడ్‌జోన్‌లలో కట్టుదిట్టం 


ఒంగోలు, మే 22, (ఆంధ్రజ్యోతి) : నాల్గో దశ లాక్‌డౌన్‌ సడలింపులు జిల్లాలో అమల్లోకి వచ్చాయి. శుక్రవారం ఒక్కోచోట ఒక్కో రకంగా వీటిని కొనసా గించారు. కొన్నిప్రాంతాల్లో మధ్యాహ్నం వరకూ, మరికొన్ని చోట్ల సాయంత్రం వరకూ దుకాణాలకు అనుమతించారు. అదేసమయంలో పాజిటివ్‌ కేసు లు అధికంగా ఉన్న, తాజాగా  కేసులు నమోదైన ప్రాంతాల్లో మాత్రం కట్టడి చర్యలు కొనసాగించారు. ఒంగోలు నగరంతోపాటు దర్శి, చీరాల, గుడ్లూరు వంటిచోట్ల ఎప్పటి లాగే ఉదయం 9గంటల వరకూ కూరగాయలు, నిత్యావసరాలను మాత్రమే అనుమ తించారు. తరువాత అన్నింటిని మూసేయించారు. ఆరెంజ్‌ జోన్లుగా ఉన్న ప్రాంతాల్లో వస్త్ర, చెప్పులు, బంగారం దుకాణాలు మినహా మిగతా వాటిని మ ధ్యాహ్నం ఒంటి గంట వరకూ అనుమతించారు. ఇతర నాన్‌కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో కొన్నిచోట్ల మ ధ్యాహ్నం వరకు, మరికొన్ని చోట్ల సాయంత్రం వర కూ సడలింపులు ఇచ్చారు. రెండు, మూడు రోజుల తరువాత సడలింపులు మరికొంత ఉండవచ్చని ఆయా ప్రాంతాల్లో అధికారులు చెప్తున్నారు.  

Advertisement
Advertisement
Advertisement