Abn logo
Sep 20 2021 @ 15:57PM

ఆస్పత్రికి వెళ్లే లోపే ఆయువు తీరిపోయింది

మంచిర్యాల: అకస్మాత్తుగా పడిన పిడుగుపాటు ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. కొడుకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆస్పత్రికి వెళుతుండగా వర్షం కురిసి పిడుగు పడింది. అయితే పిడుగుపాటు దాటికి తల్లికొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. చిన్నారి శ్రీయాన్ (ఏడాదిన్నర), భార్య మౌనిక అక్కడికక్కడే మృతి చెందారు. భర్త వెంకటేష్ తీవ్రగాయాలయ్యాయి. రైల్వే ప్లై ఓవర్ బ్రిడ్జిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పిడుగుపాటు ఘటన వివరాలు తెలుసుకున్న కలెక్టర్ భారతీ హోళీ కేరీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.. ఆస్పత్రికి వెళ్లి వెంకటేష్ పరిస్థితిపై ఆరా తీశారు. 

క్రైమ్ మరిన్ని...