Abn logo
Oct 24 2020 @ 04:58AM

కరోనాతో ఇద్దరి మృతి

Kaakateeya

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): కరోనా మరణాలు పెరుగుతున్నాయి. రోజూ ఒకరిద్దరు మృతి చెందుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో నెల రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. శుక్రవారం ఇద్దరు మృతి చెం దారు. ఇప్పటి వరకూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మృతి చెందిన వారి సంఖ్య 295కు చేరుకుంది. 


రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో  218 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 206 కేసులు నమోదు కాగా వికారా బాద్‌ జిల్లాలో 12 కేసులు నమోద య్యాయి. ఇప్పటి వరకు మూడు జిల్లాల్లో  కొవిడ్‌ బాధితుల సంఖ్య 93,081కి చేరుకుంది. 

 

ఇబ్రహీంపట్నం, చేవెళ్ల డివిజన్లలో.. 

ఇబ్రహీంపట్నం/ చేవెళ్ల: ఇబ్రహీంపట్నం డివిజన్‌లో శుక్రవారం 11 కేంద్రాల్లో 199 మందికి  యాంటీజెన్‌ టెస్టులు చేయగా 20 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇబ్రహీంపట్నంలో ఒకరికి, యాచారంలో మరొకరు, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 6,తట్టిఅన్నారంలో 5, హయత్‌నగర్‌లో  ఇద్దరికి, రాగన్నగూడలో 5కి పాజిటివ్‌గా తేలింది. చేవెళ్ల పీహెచ్‌సీలో 18మందికి పరీక్షలు చేయగాఇద్దరికి, ఆలూర్‌పీహెచ్‌సీలో 11 మందికి పరీక్షలు చేయగా అందరికీ నెగెటివ్‌గా తేలింది. శంకర్‌పల్లి మండలంలో 31 మందికి పరీక్షలు చేయగా ఒకరికి, మొయినాబాద్‌ మండలంలో 42 మందికి పరీక్షలు చేయగా నలుగురికి, షాబాద్‌ మండలంలో ఐదుగురికి పరీక్షలు చేయగా అందరికీ నెగెటివ్‌ వచ్చింది. 

Advertisement
Advertisement