Abn logo
Oct 24 2020 @ 16:22PM

రుణ గ్రహీతలకు దీపావళి కానుక... వడ్డీపై వడ్డీ రద్దు...

Kaakateeya

న్యూఢిల్లీ : రుణ గ్రహీతలకు పండుగల సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.2 కోట్ల వరకు రుణాలు తీసుకున్నవారికి వడ్డీపై వడ్డీని రద్దు చేసింది. ఇటీవల ఆర్బీఐ ప్రకటించిన మారటోరియం సదుపాయాన్ని వినియోగించుకున్నవారికి కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది. దీంతో ఖజానాపై రూ.6,500 కోట్ల భారం పడుతుంది. 


వడ్డీ రద్దు పథకాన్ని త్వరగా ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ మార్గదర్శకాలను శుక్రవారం బాగా పొద్దుపోయాక విడుదల చేసింది. 


సుప్రీంకోర్టు ఈ నెల 14న దీనికి సంబంధించిన ఆదేశాలను ఇచ్చింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ప్రకటించిన మారటోరియం స్కీమ్ క్రింద రూ.2 కోట్ల వరకు రుణాలపై వడ్డీపై వడ్డీని రద్దు చేయడానికి సంబంధించిన నిర్ణయాన్ని సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని తెలిపింది. సామాన్యుల దీపావళి పండుగ సంబరాలు ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయని తెలిపింది. 


ఈ మార్గదర్శకాల ప్రకారం 2020 మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు నిర్దిష్ట రుణ ఖాతాల్లో రుణ గ్రహీతలు ఈ పథకం సదుపాయాన్ని పొందవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి రుణదాతలైన సంస్థలు ఇచ్చే అన్ని రకాల సదుపాయాలతో కలిపి రూ.2 కోట్లకు మించకుండా శాంక్షన్డ్ లిమిట్స్, ఔట్‌స్టాండింగ్ అమౌంట్ కలిగినటువంటి రుణ ఖాతాలుగల రుణ గ్రహీతలు ఈ పథకానికి అర్హులవుతారు. ఫిబ్రవరి 29నాటికి ఈ ఖాతాలు నాన్ పెర్మార్మింగ్ అసెట్స్ కాకూడదు, స్టాండర్డ్ అకౌంట్స్ అయి ఉండాలి. 


ఈ పథకం పరిథిలోకి గృహ రుణాలు, విద్యా రుణాలు, క్రెడిట్ కార్డ్ బాకీలు, ఆటో రుణాలు, ఎంఎస్ఎంఈ రుణాలు, కన్సూమర్ డ్యూరబుల్ రుణాలు, కన్జంప్షన్ లోన్స్ వస్తాయి. 


Advertisement
Advertisement