Abn logo
Aug 4 2021 @ 00:07AM

కష్టాల్లో ఉన్న గ్రానైట్‌ పరిశ్రమను ఆదుకోండి

మంత్రి బాలినేనికి వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

మంత్రి బాలినేనికి వినతి


చీమకుర్తి, ఆగస్టు 3 : కష్టాల్లో ఉన్న గ్రానైట్‌ పరిశ్రమని ఆదుకోవాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని చిన్నతరహ పరి శ్రమల అసోసియేషన్‌ నాయకులు కోరా రు. మంగళవారం తాడేపల్లిలో మంత్రి బా లినేనిని మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్ర సాదరెడ్డితో కలిసి వారు వినతిపత్రం అం దజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ నాయకులు మాట్లాడుతూ  రాయల్టి రేటు తగ్గిస్తామని నాటి పాదయాత్రలో సీఎం జగన్‌ మోహనరెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. అయితే అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడంతో గ్రానైట్‌ ఫ్యాక్టరీలు మూతపడే పరిస్థితులు నెల కొన్నాయని వాపోయారు. అలాగే కరెంట్‌ చార్జీల ను కూడా తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమం లో క్రిస్టిపాటి శేఖరరెడ్డి, మస్తాన్‌రెడ్డి, ప్రసాదరె డ్డి, బాపతు వెంకటరెడ్డి, లింగా రామకృష్ణారెడ్డి, గుజ్జుల సంజీవరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ప్ర సాద్‌, శేషగిరిరావు పాల్గొన్నారు.