Abn logo
Nov 30 2020 @ 01:08AM

ఆ సర్జరీతో ఎముకలు బలహీనం

అధిక బరువుతో బాధపడే వాళ్లు బేరియాట్రిక్‌ సర్జరీల వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయని ఒక అధ్యయనంలో వెల్లడయింది. బరువు తగ్గడం కోసం చాలా మంది స్లీవ్‌ గ్యాస్ట్రెక్టమీ అనే సర్జరీని ఎంచుకుంటారు. ఈ సర్జరీలో భాగంగా ఆహారం తీసుకునే పరిమాణం తగ్గడం కోసం 75 శాతం జీర్ణాశయంను తగ్గిస్తారు. అయితే దీనివల్ల ఎముకలు బలహీనపడిపోతాయి. బోస్టన్‌ హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయింది. ‘‘స్లీవ్‌ గ్యాస్ట్రెక్టమీ చేయించుకున్న వారిలో బోన్‌ డెన్సిటీ బాగా తగ్గిపోయింది. ఎముకలు సులభంగా విరిగిపోయే అవకాశం ఉంది’’ అని అధ్యయనంలో పాలుపంచుకున్న మిరియం ఎ బ్రెడెల్లా వివరించారు. 

Advertisement
Advertisement
Advertisement