Abn logo
Jun 4 2020 @ 03:26AM

రంగులు మీ ముఖాలకు వేసుకోండి: బొండా ఉమ

‘‘మీ పార్టీ రంగులపై ప్రేమ ఉంటే మీ ముఖాలకు వేసుకోండి. మీ డబ్బుతో మీ ముఖాలకో... మీ ఇళ్ళకో వేసుకొంటే ఎవరికీ అభ్యంతరం లేదు’’ అని టీడీపీ అధికార ప్రతినిధి బొండా ఉమామహేశ్వరరావు వైసీపీ నేతలకు స్పష్టం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల సొమ్ముతో ప్రభుత్వ భవనాలకు రంగులు వేశారనీ, సుప్రీం కోర్టు దానిని కొట్టివేసిందనీ, ఇప్పుడు మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలన్నారు.

Advertisement
Advertisement
Advertisement