Abn logo
Jun 4 2020 @ 08:45AM

సీఎం ఇంటికి బాంబు బెదిరింపు.. యువకుడి అరెస్ట్

చెన్నై: ముఖ్యమంత్రి నివాసగృహంలో, సచివాలయంలో బాంబులు పేలుతాయని బెదరించిన విల్లుపురం జిల్లాకు చెందిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఎగ్మూరులోని పోలీసు కంట్రోల్‌రూంకు మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి, గ్రీన్‌వేస్‌ రోడ్డులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం, సచివాలయంలోనూ బాంబులు పెట్టానని, అవి త్వరలో పేలతాయని బెదరించి లైన్‌ కట్‌ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముఖ్యమంత్రి నివాసం, సచివాలయంలో బాంబ్‌స్క్వాడ్‌తో మెటల్‌ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చివరకు అది ఉత్తుత్తి బెదరింపేనని నిర్ధారించారు.  తర్వాత పోలీసు కంట్రోలు రూంలో నమోదైన ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా బెదరింపు కాల్‌ చేసిన విల్లుపురం జిల్లా మరకాణం ప్రాంతానికి చెందిన భువనేశ్వర్‌ (25) అనే యువకుడిని అరెస్టు చేశారు. ఆ యువకుడు గతంలో ఇదే విధంగా పుదుచ్చేరి ముఖ్యమంత్రికి కూడా బాంబు బెదరింపులు చేసి అరెస్టయ్యాడని పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిసింది.

Advertisement
Advertisement
Advertisement