Sep 17 2021 @ 08:15AM

బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్‌కు ఈడీ సమన్లు..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్‌కు ఈడీ సమన్లు జారి చేసినట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్‌లో సినీ ప్రముఖుల డ్రెగ్ కేసులో విచార‌ణ జరుగుతున్న సంగతి తెలిసిందే. మ‌రోవైపు బాలీవుడ్ మ‌నీలాండ‌రింగ్‌, డ్రెగ్ కేసులోనూ కొంద‌రిని విచారిస్తున్నారు. ఇటీవ‌లే హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు డ్రగ్స్, మనీలాండరింగ్ కేసుల్లో భాగంగా సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు. ఇందులో భాగంగా ఈనెల 25వ‌ తేదీన విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. చీటర్ సురేష్‌తో ఆమెకి ఎలాంటి సంబంధాలున్నాయనే కోణంలో జాక్వెలిన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు విచారించనున్నట్లు సమాచారం. 


టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలోని ప్రముఖులను ఈడీ విచారిస్తోంది. ‏టాలీవుడ్‌లో ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్‌, చార్మీ కౌర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రానా దగ్గుబాటి, నందు, రవితేజ, నవ్‌దీప్, ఎఫ్‌–క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌, ముమైత్‌ ఖాన్‌లను ఈడీ అధికారులు విచారించగా, నేడు (సెప్టెంబర్ 17) తనీశ్, 22న తరుణ్ విచారణకు హాజరవనున్నారు.  


Bollywoodమరిన్ని...