కేటుగాడి నుంచి కోట్లు బహుమతిగా పొందిన Jacqueline Fernandez..!

బాలీవుడ్ తార, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ మధ్య సినిమాలతో కంటే ఓ కేటుగాడితో రిలేషన్‌షిప్‌ వల్ల వార్తల్లో నిలుస్తోంది. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసు విచారణ ఎదుర్కొంటూ జైలులో ఉన్న ఈ మోసగాడు సుకేష్ చంద్రశేఖర్‌తో సంబంధం ఉన్నట్లు పుకార్లు బయటికి రావడంతో ఈ అమ్మడికి సమస్యలు ప్రాబ్లెమ్స్ ప్రారంభమయ్యాయి. ఇటీవలే ఆ మోసగాడితో ఈ భామ కలిసి ఉన్న ఫోటో బయటికి రావడంతో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ తారపై మరో వార్త ప్రచారంలోకి వచ్చింది.


సుకేష్ నుంచి జాక్వెలిన్ కోట్ల రూపాయల బహుమతులు పొందిందని సమాచారం. అందులో రూ.52 లక్షల గుర్రం, రూ.9 లక్షల పెర్షియన్ కారుతో పాటు దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అతని పార్ట‌నర్ లీనా పాల్‌తోనూ సంబంధాలు ఉన్నట్లు తెలియవస్తోంది. అయితే ఈ కేటుగాడితో ఉన్న రిలేషన్‌షిప్‌పై ఈ బ్యూటీ కొట్టివేసింది. కాగా జాక్వెలిన్ ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా ‘బచ్చన్ పాండే’, ‘రామ్ సేతు’ వంటి సినిమాలు చేస్తూ కెరీర్‌లో ఎంతో బిజీగా ఉంది.

Advertisement

Bollywoodమరిన్ని...