Abn logo
Feb 25 2021 @ 20:46PM

ట్రెండ్‌ మారింది.. ఎవరైనా నటించవచ్చు

సినిమాల్లో కేవలం పెళ్ళికాని అమ్మాయిలే నటించాలన్న నియమంలేదని, ట్రెండ్‌ మారిపోవడంతో బిడ్డ తల్లులు కూడా నటిస్తున్నారని బాలీవుడ్‌ నటి ఈషా డియోల్‌ పేర్కొంది. పైగా ఇప్పటికే పలువురు హీరోయిన్లు వైవాహిక జీవితాన్ని అనుభవిస్తూనే తిరిగి వెండితెరపై రాణిస్తున్నారని చెప్పింది. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమాలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మంచి పాత్రలు వస్తే తప్పకుండా దక్షిణాది సినిమాల్లో నటిస్తానని తెలిపింది. గతంలో దర్శకుడు మణిరత్నం - హీరో సూర్య కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆయ్‌ద ఎళుత్తు’ అనే సినిమాలో నటించానని, తనకు దక్షిణాది హీరోల్లో సూర్య అంటే అమితమైన ఇష్టమని, హీరోయిన్లలో తమన్నా ఎంతో అందంగా వుంటారని చెప్పింది. తనకు మంచి కథలతో కూడిన పాత్రలు వస్తే ఖచ్చితంగా నటిస్తానని ఆమె వెల్లడించింది. తన తల్లి బయోగ్రఫీలో నటించాలంటే ముందుగా తన తల్లి అనుమతి తీసుకోవాల్సివుందని చెప్పింది. 


ఇదిలావుంటే ఇద్దరు పిల్లలకు తల్లిగా ఉన్న ఈ బాలీవుడ్‌ హీరోయిన్‌... కలర్స్‌ క్రయోమాటిక్‌ టెక్నాలజీ ద్వారా ఏకంగా 16 కిలోల బరువు తగ్గింది. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ, సాధారణంగా మహిళలు ప్రసవం తర్వాత బరువు పెరగతారని, అలాగే, తాను కూడా బరువు పెరగగా, ‘కలర్స్‌ క్రయోమాటిక్‌ టెక్నాలజీ’ని ఉపయోగించి బరువు తగ్గి సాధారణ స్థాయికి వచ్చినట్టు తెలిపింది. వాస్తవానికి ఈ టెక్నాలజీ యూరోపియన్‌, అమెరికా వంటి దేశాల్లోనే అందుబాటులో వుందని, కానీ కలర్స్‌ హెల్త్‌కేర్‌ ఈ టెక్నాలజీని దేశంలోకి తొలిసారి అందుబాటులోకి తెచ్చిందని చెప్పింది. అదేవిధంగా కలర్స్‌ సంస్థ కేశాలు, చర్మ సౌందర్యం కోసం ప్రారంభించిన కైలాన్‌ ఉత్పత్తుల గురించి కూడా ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ కార్యక్రమంలో కలర్స్‌ చీప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ శివాజీ కున తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement