Abn logo
Jul 14 2020 @ 12:49PM

బాలీవుడ్ విల‌న్‌తో ఫైట‌ర్‌?

విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫైట‌ర్, లైగ‌ర్’ అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇప్పటికే కొంత మేర‌కు చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ మార్ష‌ల్ ఆర్ట్స్ తెలిసిన వ్య‌క్తిగా క‌న‌ప‌డ‌తార‌ట‌. ఆయ‌న పాత్ర‌కు స‌రిపోయేలా ప‌వ‌ర్‌ఫుల్ లుక్స్ ఉన్న విల‌న్ కోసం మేక‌ర్స్  అన్వేషించారు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టిని విల‌న్‌గా న‌టింప చేయాల‌నుకుంటున్న‌ట్లు, ఆయ‌న‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు టాక్‌. మ‌రి సోష‌ల్ మీడియాలో విన‌వ‌స్తున్న ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement