Abn logo
Jun 4 2020 @ 10:52AM

రైతులను బురిడీ కొట్టిస్తున్న బోగస్ ఏజెన్సీలు

అనంతపురం జిల్లా: కల్యాణదుర్గం రైతులను ఏజెన్సీల పేరిట వ్యవసాయశాఖ అధికారులే బురిడీ కొట్టిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బోగస్ ఏజెన్సీలను పెట్టి మధ్యవర్తుల ద్వారా అధికారులు దళారి అవతారం ఎత్తారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై కర్ణాటక, కర్నూలు, కడప ప్రాంతాల నుంచి నాణ్యతలేని 44 కేజీల విత్తన వేరుశెనగకాయలను దొడ్డిదారిన దిగుమతి చేస్తున్నారు. వాటిని విత్తనకాయలుగా బస్తాలు రెడీ చేస్తున్నారు. అధికారులే లేబులు వేసి బోగస్ ఏజెన్సీల పేరిట అందజేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వారిచ్చే విత్తన బస్తాల్లో  రాళ్లు, చెత్త ఎక్కువగా ఉందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement