Abn logo
Oct 24 2020 @ 13:27PM

ఎల్‌టీటీఈ అధినాయకుడుగా బాబీ సింహ

Kaakateeya

శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం పోరాడిన నాయకుడు వేలుపిళ్లై ప్రభాకరన్‌. ఇప్పుడు ఈయన జీవిత చరిత్రను సినిమా రూపంలో తెరకెక్కించనున్నారు. 'సీరుం పులి'(వేటాడే పులి) పేరుతో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో వేలుపిళ్లై ప్రభాకరన్‌ పాత్రలో జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడు బాబీ సింహ నటించనున్నారు. దసరా సందర్భంగా చిత్ర యూనిట్‌ ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్‌ చేసింది. వెంకటేశ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేస్తున్నారు. రెండు భాగాలుగా ఈ బయోపిక్‌ తెరకెక్కనుంది. ప్రభాకరన్‌ పుట్టినప్పటి నుండి విద్యార్థి దశ.. అక్కడి నుండి విప్లవం వైపు ఎలా అడుగులు వేశాడనేది ఓ భాగంలో చూపిస్తే, మరో భాగంలో ఎల్‌టీటీఈ అధినేతగా ఆయన ఎలా పోరాటం చేశాడనేది చూపించబోతున్నారట. ఈ సినిమాను అనౌన్స్‌ చేశారు కానీ.. విడుదల సమయంలో సినిమాకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయనేది చర్చనీయాంశమే. 


Advertisement
Advertisement