Abn logo
Feb 24 2021 @ 02:54AM

బీఎండబ్ల్యూ మోటోరాడ్‌ ఆర్‌ 18 క్లాసిక్‌

  • ధర రూ.24 లక్షలు 


జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ.. ద్విచక్ర వాహన విభాగం బీఎండబ్ల్యూ మోటోరాడ్‌.. భారత మార్కెట్లోకి కొత్త క్రూయిజర్‌ బైక్‌ ఆర్‌ 18 క్లాసిక్‌ తీసుకువచ్చింది. ఈ బైక్‌ ధర రూ.24 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). 1802 సీసీ ఆర్‌ 18 క్లాసిక్‌ను కంప్లీట్లీ బిల్ట్‌ యూనిట్‌ (సీబీయూ)గా విడుదల చేసినట్లు బీఎండబ్ల్యూ పేర్కొంది. మంగళవారం నుంచే బీఎండబ్ల్యూ మోటోరాడ్‌ డీలర్‌ నెట్‌వర్క్‌లో ఈ బైక్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. పెద్ద విండ్‌ స్ర్కీన్‌, ప్యాసింజర్‌ సీట్‌, అదనంగా ఎల్‌ఈడీ లైట్లు, 16 అంగుళాల ఫ్రంట్‌ వీల్‌ సహా ట్రాక్షన్‌ కంట్రోల్‌, ఇంజన్‌ బ్రేక్‌ కంట్రోల్‌, ఎలకా్ట్రనిక్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌ ఫీచర్లతో ఆర్‌ 18 ను తీసుకువచ్చినట్లు తెలిపింది.

Advertisement
Advertisement
Advertisement