Abn logo
Jan 18 2021 @ 00:57AM

రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి

ఇబ్రహీంపట్నం, జనవరి 17: టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు విధి గా రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి జంపాల సీతారామయ్య అన్నారు. సోమవారం ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఇబ్రహీం పట్నం పార్టీ కార్యాలయంలో లెజెండరీ బ్లడ్‌ డొనేషన్‌ డ్రైవ్‌ క్యాంపు ఏర్పాట్లను ఆయన ఆదివారం రాత్రి పరిశీలించారు. పార్టీ మండల అధ్యక్షుడు రామినేని రాజశేఖర్‌, చెన్నుబోయిన చిట్టిబాబు పాల్గొన్నారు. 

ఫ జి.కొండూరు :  ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా  జి.కొండూరులో సోమవారం రక్తదానంతో పాటు పేదలకు పేదలకు అన్నదానం చేయనున్నట్లు టీడీపీ అధ్యక్ష, కార్యదర్శులు పజ్జూరు రవికుమార్‌, లంక రామకృష్ణ చెప్పారు. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసిన పిదప రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా రక్తదానం చేయాలని వారు కోరారు.

Advertisement
Advertisement
Advertisement