చెన్నై : శివకాశిలోని టపాసులు తయారు చేసే ఫ్యాక్టరీలో గురువారం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఐదుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. కలయార్కుర్చీ అన్న పేరుతో ఉన్న ఫ్యాక్టరీలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటన జరగగానే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంవత్సరంలో ఇలాంటి పేలుడు సంభవించడం మూడోసారి.