Abn logo
Jul 7 2020 @ 07:18AM

కొరియ‌న్ పాట‌లో గ‌ణ‌ప‌తి విగ్ర‌హం.... వివాదాస్ప‌దం కావ‌డంతో...

దక్షిణ కొరియాకు చెందిన‌ సంగీత బృందం బ్లాక్‌పింక్‌కు ప్రపంచవ్యాప్తంగా లెక్కకుమించిన అభిమానులున్నారు. వీరంతా బ్లాక్ పింక్ నుంచి వ‌చ్చే మ్యూజిక్ వీడియోల కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. తాజాగా బ్లాక్‌పింక్ ఒక కొత్త వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. ఇది వైర‌ల్‌గా మార‌డంతో పాటు వివాదాల‌కు కేంద్ర బిందువ‌య్యింది.  ఈ పాట వ్యూవ‌ర్‌షిప్ వియంలో అనేక రికార్డులు బద్దలు కొట్టింది. మరోవైపు హిందువులు భ‌క్తితో పూజించే గ‌ణేశుని విగ్ర‌హానికి అవ‌మానం జ‌రిగిందంటూ తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంది. ఈ వీడియోను చూసిన హిందువులు బ్లాక్‌పింక్ సంగీత బృందంపై హ్యాష్‌ట్యాగ్‌ల‌తో నిర‌స‌న‌ల దాడి ప్రారంభించ‌డంతో ఆ మ్యూజిక్ ట్రూప్ దిగిరాక త‌ప్ప‌లేదు. ఆ పాట‌లో గ‌ణేశుని విగ్ర‌హం క‌నిపించే భాగాన్ని క‌వ‌ర్ చేసి, త‌మ త‌ప్పు సరిదిద్దుకుంది. దీంతో హిందువుల నిర‌స‌నల‌ దాడి స‌ద్దుమ‌ణిగింది. 



Advertisement
Advertisement
Advertisement