Advertisement
Advertisement
Abn logo
Advertisement

బీజేపీలో చేరనున్న విఠల్

హైదరాబాద్‌: తెలంగాణలో ఆపరేషన్‌ ఆకర్ష్‌కు బీజేపీ పదును పెడుతోంది. బీజేపీలో చేరికలు మళ్లీ మొదలయ్యాయి. కమలం గూటికి మరో ఉద్యమకారుడు రానున్నారు. టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్ బీజేపీలో చేరనున్నారు. తొలి ప్రభుత్వంలో టీఎస్‌పీఎస్‌సీ సభ్యుడిగా విఠల్ పనిచేశారు. వారం రోజుల్లో విఠల్‌ బీజేపీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.


తెలంగాణ ఉద్యమంలో విఠల్ కీలక పాత్ర పోషించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సభ్యుడిగా విఠల్‌ను నియమించారు. ఆయన పదవీకాలం పూర్తయిన తరువాత ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. టీఆర్ఎస్‌పై అసంతృప్తితో ఉన్న విఠల్ బీజేపీలో చేరబోతున్నారని చెబుతున్నారు. విఠల్‌ను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక పాత్ర పోషించారనే ప్రచారం జరుగుతోంది.


Advertisement
Advertisement